Sunday, June 20, 2010


జీవకణాలూ, నాడీకణాలూ
డీఎన్ఏ, క్లోనింగ్ అంటే ఏమిటి? పసిపిల్లల మెదడు ఎలా ఎదుగుతుంది? జ్ఞాపకశక్తి ఎలా ఏర్పడుతుంది? ఈ విషయాలన్నిటినీ చర్చించే సైన్స్ వ్యాససంపుటి
"సూక్ష్మలోకం సంగతులు: శాస్త్రవిజ్ఞానంమీద సామాన్యపాఠకులకు అర్థమయేలా, ఆసక్తికరంగా రచనలు చేస్తున్నవారిలో కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఒకరు. పుస్తకంలోని 48 అధ్యాయాల్లో నవీనపరిశోధనలకు మూలమైన వివిధ అంశాలను రచయిత చర్చింఛారు. పుట్టటం, పెరగటం అనే ప్రక్రియల్లో జీవకణాలు, స్టెమ్‌కణాలు, వాటిలో ఉండే డీఎన్ఏ ఎలాటి పాత్ర వహిస్తాయో ఈ వ్యాసాల ద్వారా తెలుసుకోవచ్చు. మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలు, కన్ను పనిచేసే తీరును కొన్ని వ్యాసాలు తెలుపుతాయి. జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, నాడీమండలం విశేషాలపై ప్రాథమికస్థాయిలో అవగాహన్ పెంచటానికి ఇవి పనికివస్తాయి." - ఈనాడు
స్వేచ్ఛాసాహితి ప్రచురణ
జి 1, మైత్రి రెసిడెన్సీ,
స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040 2726 3161
వెల రూ.90
ప్రతులకు dvrkrao166@gmail.com