Friday, June 15, 2012
అణువుల శక్తి
· పదార్థాలన్నీ అణువుల మయమే అనడానికి ఆధారాలేమిటి?
· అణువులూ, బృహదణువులూ ఎలా రూపొందాయి?
· శతాబ్దాలుగా అణువుల అన్వేషణలో పాల్గొన్న శాస్త్రవేత్తలెవరు?
· అణువులూ, బృహదణువుల లక్షణాలనుబట్టి పదార్థాల స్వభావాలెలా మారుతాయి?
· నానోటెక్నాలజీ అంటే?
· అణుప్రయోగాలకూ, సిద్ధాంత నిరూపణకూ పనికొచ్చే పరికరాలూ, వ్యవస్థలూ ఎలా పనిచేస్తాయి?
· పదార్థాల్లోని మూలకణాల రహస్యాలేమిటి?
· అణువుల నిర్మాణం, వాటి అంతర్భాగాల్లో ఇమిడి ఉండే శక్తులూ ఎలాంటివి?
· అణుశక్తి ఎలా విడుదల అవుతుంది? శక్తికి నిర్వచనమేమిటి? దానికెన్ని రూపాలున్నాయి?
· అణువుల అస్థిరత రేడియోధార్మికతకు ఎలా దారితీస్తుంది? అందులోని ప్రమాదాలేమిటి?
· అణ్వస్త్రాలు ఎలా పనిచేస్తాయి? వాటిని ఎలా నిర్మిస్తారు?
· అణురియాక్టర్ల నిర్మాణం, పనితీరు ఎలా ఉంటాయి?
· చెర్నోబిల్, ఫుకుషిమా రియాక్టర్లలో ప్రమాదాలు ఎందుకు, ఎలా తలెత్తాయి?
· అణువిద్యుత్తు గురించిన భయాందోళనలు సమంజసమైనవేనా?
సామాన్యపాఠకులకు సులువుగా అర్థమయే శైలిలో ఈ ప్రశ్నలన్నిటికీ ఈ పుస్తకం సమాధానాలిస్తుంది. అణువుల్లో నిక్షిప్తమైన శక్తి ఎటువంటిదో, దానివల్ల కలిగే లాభనష్టాలేమిటో ప్రతివారూ చదివి తెలుసుకో గలుగుతారు.
హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ
వెల 100 రూ
Sunday, January 01, 2012
సముద్రాలు, వాతావరణం, పర్యావరణం గురించిన విశేషాల సమాహారం
కొడవటిగంటి రోహిణీప్రసాద్ రచన
స్వేచ్ఛాసాహితి ప్రచురణ
వెల 90 రూ.
ప్రతులకు వీక్షణం,మైత్రి రెసిడెన్సీ,
3-6-394, స్ట్రీట్ నం.3,
హిమాయత్ నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040-66843495
Tuesday, September 13, 2011
మనుషులు చేసిన దేవుళ్ళు
మతవిశ్వాస పరిణామాల వైజ్ఞానిక విశ్లేషణ
కొడవటిగంటి రోహిణీప్రసాద్
వెల: రూ. 100
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
91 40 2352 1849
Review: http://venuvu.blogspot.in/2011/10/blog-post.html
మతవిశ్వాస పరిణామాల వైజ్ఞానిక విశ్లేషణ
కొడవటిగంటి రోహిణీప్రసాద్
వెల: రూ. 100
ప్రతులకు: హైదరాబాద్ బుక్ ట్రస్ట్
91 40 2352 1849
Review: http://venuvu.blogspot.in/2011/10/blog-post.html
and: http://hyderabadbooktrust.blogspot.in/2012/02/blog-post_26.html
http://www.hyderabadbooktrust.blogspot.com/
http://www.hyderabadbooktrust.blogspot.com/
Sunday, June 20, 2010
జీవకణాలూ, నాడీకణాలూ
డీఎన్ఏ, క్లోనింగ్ అంటే ఏమిటి? పసిపిల్లల మెదడు ఎలా ఎదుగుతుంది? జ్ఞాపకశక్తి ఎలా ఏర్పడుతుంది? ఈ విషయాలన్నిటినీ చర్చించే సైన్స్ వ్యాససంపుటి
"సూక్ష్మలోకం సంగతులు: శాస్త్రవిజ్ఞానంమీద సామాన్యపాఠకులకు అర్థమయేలా, ఆసక్తికరంగా రచనలు చేస్తున్నవారిలో కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఒకరు. పుస్తకంలోని 48 అధ్యాయాల్లో నవీనపరిశోధనలకు మూలమైన వివిధ అంశాలను రచయిత చర్చింఛారు. పుట్టటం, పెరగటం అనే ప్రక్రియల్లో జీవకణాలు, స్టెమ్‌కణాలు, వాటిలో ఉండే డీఎన్ఏ ఎలాటి పాత్ర వహిస్తాయో ఈ వ్యాసాల ద్వారా తెలుసుకోవచ్చు. మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలు, కన్ను పనిచేసే తీరును కొన్ని వ్యాసాలు తెలుపుతాయి. జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, నాడీమండలం విశేషాలపై ప్రాథమికస్థాయిలో అవగాహన్ పెంచటానికి ఇవి పనికివస్తాయి." - ఈనాడు
"సూక్ష్మలోకం సంగతులు: శాస్త్రవిజ్ఞానంమీద సామాన్యపాఠకులకు అర్థమయేలా, ఆసక్తికరంగా రచనలు చేస్తున్నవారిలో కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఒకరు. పుస్తకంలోని 48 అధ్యాయాల్లో నవీనపరిశోధనలకు మూలమైన వివిధ అంశాలను రచయిత చర్చింఛారు. పుట్టటం, పెరగటం అనే ప్రక్రియల్లో జీవకణాలు, స్టెమ్‌కణాలు, వాటిలో ఉండే డీఎన్ఏ ఎలాటి పాత్ర వహిస్తాయో ఈ వ్యాసాల ద్వారా తెలుసుకోవచ్చు. మెదడు ఎదుగుదల, జ్ఞాపకశక్తికి సంబంధించిన అంశాలు, కన్ను పనిచేసే తీరును కొన్ని వ్యాసాలు తెలుపుతాయి. జీవశాస్త్రం, జన్యుశాస్త్రం, నాడీమండలం విశేషాలపై ప్రాథమికస్థాయిలో అవగాహన్ పెంచటానికి ఇవి పనికివస్తాయి." - ఈనాడు
స్వేచ్ఛాసాహితి ప్రచురణ
జి 1, మైత్రి రెసిడెన్సీ,
స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040 2726 3161
వెల రూ.90
ప్రతులకు dvrkrao166@gmail.com
Saturday, January 16, 2010
'మానవపరిణామం'
క్షీరదాల దశనుంచి నాగరికతదాకా కొనసాగిన మానవజాతి పరిణామచరిత్ర
గురించిన సైన్స్ వ్యాససంపుటి
స్వేచ్ఛాసాహితి ప్రచురణ
జి 1, మైత్రి రెసిడెన్సీ,
స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040 2726 3161
వెల రూ.90
జి 1, మైత్రి రెసిడెన్సీ,
స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040 2726 3161
వెల రూ.90
"మనిషి కథ: మనిషి ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు? ఎలా విజ్ఞానవంతుడయాడు? ఆ పరిణామక్రమం ఎప్పటికీ ఉత్కంఠభరితమే. ఈ 350 కోట్ల సంవత్సరాల ప్రయాణాన్ని హేతుబద్ధంగా వివరిస్తుంది కొడవటిగంటి రోహిణీప్రసాద్ 'మానవపరిణామం'. రోహిణీప్రసాద్ నిరాడంబరమైన 'గాంధీశైలి'ని తండ్రి కుటుంబరావుగారినుంచి పుణికిపుచ్చుకున్నారు. శాస్త్రీయదృక్పథాన్ని అలవరుచుకోడానికి ఉపకరించే గ్రంథమిది. పాఠ్యపుస్తకాల్లోని కొరుకుడుపడని పదజాలంతో విసిగిపోయిన విద్యార్థులకు ఇదో ప్రత్యామ్నాయ సైన్సు పుస్తకం" - ఈనాడు
dvrkrao166@gmail.com
dvrkrao166@gmail.com
Thursday, October 01, 2009
'విశ్వాంతరాళం'
అంతరిక్షం గురించిన సైన్స్ వ్యాససంపుటి
స్వేచ్ఛాసాహితి ప్రచురణ
జి 1, మైత్రి రెసిడెన్సీ,
స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040 2726 3161
వెల రూ.90
"విశ్వవిజ్ఞానం: ఆధునికశాస్త్రీయ సాంకేతికవిజ్ఞానం అందరికీ అందాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పిన 'విశ్వాంతరాళం' పుస్తకం ప్రచురణకర్తల లక్ష్యాన్ని నెరవేర్చే విధంగానే రూపుదాల్చింది. అణుధార్మికశాస్త్రవేత్తగా పనిచేసి..ప్రస్తుతం కన్సల్టెంట్‌గా ఉంటున్న కొడవటిగంటి రోహిణీప్రసాద్ సులభశైలి, తాజా వివరాలతోకూడిన చేకూరిన సమగ్రత ఈ పుస్తకానికి నిండుదనాన్నిచ్చాయి. భూమి పుట్టుకనుంచి బుద్ధిజీవుల ఉనికివరకు మన గురించి, మన సౌరకుటుంబం గురించి మన విశ్వం గురించి అవగాహననేకాదు, విస్తృతదృక్పథాన్నీ కలిగిస్తుందీ పుస్తకం. ఒక్కో గ్రహంనుంచి ఆసక్తికరమైన వివరాలతోపాటు, రకరకాల టెలిస్కోపులు, వికిరణాలు, రోదసీనౌకల్లో రకాలు, గ్రహాంతరసంకేతాలు, లాంటి అంశాలపై ఎన్నో ఆశ్చర్యకరమైన, అధికారికమైన సమాచారాన్ని ప్రోదిచేసి, క్రోడీకరించి, విస్పష్టంగా వివరించే ఈ పుస్తకాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఉంచుకోవలసిందే." - ఈనాడు
dvrkrao166@gmail.com OR
For review pl. visit: http://www.eemaata.com/em/issues/200911/1503.htmldvrkrao166@gmail.com OR
Tuesday, June 10, 2008
జీవశాస్త్రవిజ్ఞానం - సమాజం
కొడవటిగంటి రోహిణీప్రసాద్ సైన్సు వ్యాససంపుటి
“అరచేతిలో సైన్స్ - ...మన పాఠ్యపుస్తకాలు ఇలా ఉంటే ఎంత
బావుండేదనిపిస్తుంది...విషయం ఏదైనా చందమామ కథంత సాఫీగా సాగిపోతుంది” – ఈనాడు
“(ఈ) పుస్తకం
కేవలం తెలుగు రచనల పరిధిని పెంచడానికి కాక విద్యార్థులు వీటిని చదివి
సైన్స్ పట్ల ఇష్టాన్ని పెంచుకుని శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడుతుంది.
మరీ ముఖ్యంగా ప్రజలలో మూఢనమ్మకాల్ని తొలగించే హేతువాదాలకు,
ప్రగతివాదాలకు
ఎంతగానో ఉపయోగపడుతుంది… మన మదిలో మెదిలే ప్రశ్నలను ముందుగానే
పేర్కొంటూ సమాధానాలివ్వడం, ఆ సమాధానాలకు అవసరమైన
ఆధారాలను, గణాంకాలను, సిద్ధాంతాలను వివరించడం పుస్తకంలోని
వ్యాసాలన్నింటిలో కనిపిస్తుంది. సైన్స్‌లో లోతైన పరిజ్ఞానం లేనివారికి
సైతం అరటిపండు ఒలిచిన చందంగా అవగాహన చేయించడం రచయిత రచనాకౌశలానికి
నిదర్శనం… ఈ
గ్రంథం చిన్నదిగా అనిపించినా దీని కోసం రచయిత పడిన శ్రమ, వెలువరించిన వ్యాసాల
విలువ అమూల్యం.” - స్వేచ్ఛాలోచన మాసపత్రిక
ఈ పుస్తకంలో...
·
జీవపరిణామ
సిద్ధాంతానికి ఆధునిక వివరణ
·
మనుషులూ, ఇతర ప్రాణుల మనుగడకూ, ప్రవర్తనకూ
జన్యుపరమైన ఆధారాలు
·
ప్రాణుల చావుపుటకల
కీలకం
·
జన్యువుల స్వార్థ
లక్షణాలు
·
తక్కిన ప్రాణికోటి
పై బాక్టీరియా, వైరస్‌ల ఆధిక్యత ఎటువంటిది?
·
మనని కలవరపెట్టే
అనేక మౌలిక సమస్యలకు సులువైన సమాధానాలు
·
భౌతికవాదులూ, హేతువాదులూ అందరూ చదవదగ్గ పుస్తకం
- విద్యార్థులకూ, యువతీయువకులకూ బహుమతిగా ఇవ్వదగ్గ సరళ రచన
1/8 డెమ్మీ సైజులో 208 పుటలు
వెల 100 రూపాయలు
ప్రతులకు, వివరాలకు -
వెల 100 రూపాయలు
ప్రతులకు, వివరాలకు -